
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు
చింతలపూడి సీఐ రవీందర్ నాయక్ కి రాబడిన సమాచారం మేరకు 16.11.2024 వ తేది శనివారం చింతలపూడి మండలం శివాపురం గ్రామంలో పేకాట స్థావరంపై దాడుల్లో నిర్వహించి 16 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 60,000 రూపాయలను స్వాధీనం చేసుకుని వారిపై చింతలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లుగా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ చింతలపూడి సర్కిల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేకాట కోడిపందాలు సమాచారాన్ని పోలీసు వారికి గాని డయల్ 112 కు గాని సమాచారాన్ని తెలియచేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు.
Be the first to comment