తస్మాత్ జాగ్రత్త.. ఆ పదవులు నిర్వహిస్తే గోవిందా గోవిందా

తస్మాత్ జాగ్రత్త.. ఆ పదవులు నిర్వహిస్తే గోవిందా గోవిందా!!!!

రాజకీయ నాయుకులు కు కొన్ని పదవులు నిర్వహిస్తే కలిసి రాధట.. ఆ పదవులు నిర్వహించిన వారిలో ఒకరో!! ఇద్దరో!! మళ్ళీ ఎన్నికలలో విజయం సాధించారే తప్పా, మిగతా వారందరూ, ఓడిపోయే సెంటిమెంట్ కు దాసోహం అవ్వక తప్పలేదు.. ఆ పదవులు ఎందుకు తీసుకున్నామా? అని కొందరు నేతలు లబో, డిబో అని వాపోయి వుంటారు.. ఆ పదవులు తీసుకుంటే, ఓడిపోయే సెంటిమెంట్ ఉంటుందని తెలిసినా కూడా పదవుల కక్కుర్తి పడ్డారు.. ఆశ పడ్డారు.. ఆ తరువాత జరిగిన ఎన్నకలలో దభీమని ఛతికల పడ్డారు. ఏమా ఆ పదవులు అని తెలుసుకోవాలని ఉందా!! అయితే తెలుసుకోండి.. అదే ఆ పదవులు ఏమంటే… అసెంబ్లీ పదవులండి.. ఈ పదవులు నిర్వహించిన వారెవ్వరూ, ఆ తరువాత జరిగిన ఎన్నికల లో ఘోరం గా ఓడిపోవటం ఖాయం అన్న సెంటిమెంట్ వుంది .. ఆ సెంటిమెంట్ అటు ఉమ్మడి రాష్ట్రంలో.. ఇటు ప్రత్యేక రాష్ట్రం లో నిజం అయ్యింది.. ఉమ్మడి రాష్ట్రం విషయం ప్రక్కన బెడితే, 2014 లో ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ అధికారం లోకి వచ్చాక,అసెంబ్లీ స్వీకర్ గా డిప్యూటీ స్వీకర్ గా , చీప్ విప్ గా , విప్ లుగా పదవులు నిర్వహించిన వారెవ్వరూ, 2019 ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించ లేదు.. మళ్ళీ ఆ సెంటిమెంట్ నిజమైంది.. 2019 లో కూడా అదే పరిస్థితి స్పష్టంగా కన్పించింది.. వైసిపి ప్రభుత్వంలో అసెంబ్లీ స్వీకర్ గా, డిప్యూటీ స్వీఖర్ గా, అసెంబ్లీ చీప్ విప్ గా, విప్ లు గా పదవులు నిర్వహించిన వారిలో ఏ ఒక్కరూ, 2024 ఎన్నికలలో ఘోరాతి ఘోరం గా, చిత్తు, చిత్తు గా ఓడిపోయారు.. మళ్ళీ అదే సెంటిమెంట్..టీడీపీ హయాంలో స్వీఖర్ గా బాధ్యతలు నిర్వహించిన కోడెల శివప్రసాద్ గారు, వైసిపి ప్రభుత్వంలో స్వీఖర్ గా బాధ్యతలు నిర్వహించిన తమ్మినేని సీతారాం గారు, వేల ఓట్ల తేడాతో ఘోరాతి, ఘోరంగా ఓడిపోయారు. మళ్ళీ సెంటిమెంట్ నిజమయ్యింది..అదే విధంగా టీడీపీ, వైసిపి హయాం లలో అసెంబ్లీ చీప్ విప్ లు గా, విప్ లుగా బాధ్యతలు నిర్వహించిన వారందరూ కూడా ఎన్నికలలో ఓడిపోయారు.. మళ్ళీ అదే సెంటిమెంట్.. ప్రస్తుతం స్వీకర్ పదవి లో వున్న, అయ్యన్నపాత్రుడు గారు, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తి లేదని తేల్చి చెప్పారు.. డిప్యూటీ స్వీఖర్ RRR గారు, మళ్ళీ ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా, ఎంపీ గా పోటీ చేసే అవకాశం వుంది.. అసెంబ్లీ చీప్ విప్ తో పాటు విప్ లు గా నియమితులైన వారందరిలో, ఎవరెవ్వరు, ఏయే పార్టీ తరుపున పోటీ చేసినా ఓటమి సెంటిమెంట్ కు బలికాకతప్పదేమో??!!..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*