నాగబాబుకు మంత్రి పదవి.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

నాగబాబుకు మంత్రి పదవి.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

అమరావతి: రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

సోమవారం మంగళగిరిలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సోదరుడు, జనసేన నాయకుడు అయిన నాగబాబుకు (Naga Babu) మంత్రి పదవి ఇచ్చే విషయమై స్పందించారు.

”మాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. మనతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని నేను గుర్తించాలి. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం నాగబాబు నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలి. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం”

”మనోహర్‌, హరిప్రసాద్‌ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. ఎవరికి ప్రతిభ ఉందో చూసి, వాళ్లకు పదవులు ఇస్తాం. ఈ విషయంలో మీరెందుకు జగన్‌ను అగడలేదు? కేవలం పవన్‌కల్యాణ్‌ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చ చేస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నాం. కుదరలేదు కాబట్టి, ఎమ్మెల్సీ అనుకున్నాం. కందుల దుర్గేష్‌ ఏ కులమో నాకు తెలియదు. ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చా. రాజకీయాల్లో కులం కాదు.. పని తీరే ప్రామాణికం” అని పవన్‌కల్యాణ్ అన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*