ఏపీ నూతన సీఎస్ విజయానంద్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆయన స్వస్థలం కడప జిల్లా, రాజుపాలెం మండలంలోని అయ్యవారిపల్లె
రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు.
1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయనను సీఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.
ఆ స్థానంలో కొత్త సీఎస్ గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు.
వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం.*
ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ తొలి పోస్టింగ్ నిర్వహిం చారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు.
ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు కొనసా గారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)గానూ పనిచేశారు.
2025 నవంబరులో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు. విజయానంద్ పదవీకాలం ముగి శాక.. సీఎస్ గా జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన”


Be the first to comment