ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి గా చూద్దాం అనే కాపుల సంకల్పం

ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి గా చూద్దాం అనే కాపుల సంకల్పం

ఒక్కసారి పవన్ కళ్యాణ్ ని చూద్దాం అనే కాపుల సంకల్పం ఆయన్ని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ని చేసింది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. 24-11-2024 ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన కాపు కులస్థుల కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి పీఠం కాపులకు చేరువకి రావడానికి ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి మద్దత్తు ఇచ్చి నవతరం పార్టీ ఎన్నికల్లో కూటమికి సంఘీభావం తెలిపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు. అందరికి అండగా చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో వేదిక పైనున్న నేతలు నిలవడం అభినందనీయం అన్నారు.కాపు ప్రముఖులు మల్లెల రాజేష్ నాయుడు, తోట రాజా రమేష్, మండలనేని సుబ్బారావు, మల్లెల శివ నాగేశ్వరావు,మండలనేని సుబ్బారావు, మండలనేని చరణ్ తేజ,తోట శ్రీనివాసరావు, మిరియాల రత్నకుమారి,ఆముదాల లీలా కిషోర్ పాల్గొన్నారు.కార్యక్రమం ఉయ్యురు నరసింహారావు, గజేంద్ర కొండలు,ఎస్ ఆర్ శ్రీను తదితరులు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*