జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జనసేన నాయకులు

జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు సింగరాయకొండ గ్రామ పంచాయితీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టిన త్రిసభ్య కమిటీ

జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ గ్రామపంచాయతీలో గత వైసిపి ప్రభుత్వంలో సర్పంచ్ తాటిపర్తి వనజ అధికారాన్ని అడ్డుపెట్టుకొని గ్రామ పంచాయితీలో అధిక మొత్తంలో నిధులు దుర్వినియోగం చేశారు. జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ గారికి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ గారికి ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. సర్పంచ్ తాటిపర్తి వనజ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, అవినీతిపై దృష్టి పెట్టి అవినీతికి పాల్పడ్డారు. జనసేన నాయకుల ఫిర్యాదు మేరకు ఈరోజు త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టడం జరిగింది, ఈ విచారణ పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరగాలని తప్పు చేసిన ఎంతటి వారినైనాసరే చట్టపరమైన చర్యలు తీసుకుని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారి దగ్గర నుండి ప్రజా సొమ్ము తిరిగి రికవరీ చేయాలని జనసేన పార్టీ నాయకులు మరియు కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారు అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*