సుడా చైర్మన్ ప్రమాణ స్వీకరానికి గైరు హాజరైన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే లు

 

సుడా చైర్మన్ ప్రమాణ స్వీకరానికి గైరు హాజరైన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే లు

శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీల ఐక్యత పై సందిగ్ధత

సుడా చైర్మన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు

శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంతో జిల్లాలో కూటమి పార్టీల ఐక్యతపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. 2024 ఎన్నికల్లో పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లోని కూటమి అభ్యర్థుల గెలుపునకు భార్య భవాని తో కలిసి కృషి చేసినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, జనసేన పార్టీ నాయకులు కొరికాన రవికుమార్ ను కూటమి ప్రభుత్వం సుడా చైర్మన్ గా నియమించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి చెందిన నాయకునికి ప్రాధాన్యత గల పదవి ఇవ్వడంపై జనసైనికుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జన సైనికులకు ఉన్నతి పదవితో అధినేత పవన్ కళ్యాణ్ సత్కరించారని పార్టీ పటిష్టతకు ఉపయోగపడుతుందని భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలని జనసైనికులు భావించారు. అందరి నిర్ణయం మేరకు రవికుమార్ సుడా చైర్మన్ గా డిసెంబర్ 5 గురువారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రులతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అలాగే కూటమి పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు రవికుమార్ స్వయంగా ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి భారీగా జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చినప్పటికీ కూటమిలోని మిగతా రెండు పార్టీలకు చెందిన నాయకులు అంతంతమాత్రంగా హాజరైనట్లు విమర్శలు వినిపించాయి. అట్ట హసంగా ప్రమాణ స్వీకారం నిర్వహించినప్పటికీ ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు మినహా మిగతా ఎమ్మెల్యేలు హాజరవ్వలేదు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తరఫున జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు హాజరయ్యారు. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి, బిజెపి జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. సుడా వైస్ చైర్మన్ గా వ్యవహరించాల్సిన జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. కూటమి పార్టీల్లో ఐక్యత పేరుకేనా ఆచరణలో ఉండదా అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రమాణ స్వీకారానికి టిడిపిలో చాలామంది హాజరు కాకపోవడంపై జనసైనికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుడా చైర్మన్ పదవి కోసం పలువురు ప్రయత్నించినప్పటికీ రవికుమార్ కు దక్కడంతో అసంతృప్తిగా ఉన్నారా……. లేదా కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కట్టబెట్టడంపై మిగతావారు గుర్రుగా ఉన్నారా అనే సందేహాలు జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు.మిగతా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, జిల్లాస్థాయి అధికారులు హాజరు కాకపోవడం పై దీని వెనక ఎవరి హస్తమైన ఉందేమోనని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చాలా నియోజకవర్గాలలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో తమకు గుర్తింపు స్థానికంగా ఉన్న నాయకులు ఇవ్వనప్పటికీ హాజరవుతున్నామని…… స్వయంగా ఆహ్వానించినప్పటికీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడంపై జనసైనికులు పలు సామాజిక మాధ్యమాల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలని రవికుమార్ కు జనసైనికులు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిణామం కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని రానున్న రోజుల్లో ఇలా జరగకుండా పటిష్ట చర్యలు కూటమి అధినాయకత్వం తీసుకోవాలని కోరుతున్నారు. భారీగా జనం వచ్చి ప్రమాణ స్వీకారం సక్సెస్ అయిందని సంతోషించాలా చాలామంది ఎమ్మెల్యేలు గైర్హాజరావడంపై బాధపడాలో తెలియని పరిస్థితి రవికుమార్ కి నెలకొందని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*