స్నేహశీలి, ఆప్తుడు, ప్రజా సేవకుడు శ్రీ రామిశెట్టి వెంకట సుబ్బారావుగారి జన్మ దినం నేడు!

స్నేహశీలి, ఆప్తుడు, ప్రజా సేవకుడు శ్రీ రామిశెట్టి వెంకట సుబ్బారావుగారి జన్మ దినం నేడు!

ఎల్లవేళలా చిరు నవ్వులు చిందిస్తూ ఉండే శ్రీ రామిశెట్టి వెంకట సుబ్బారావుగారి జీవితం గురించి అడిగితే అతడేమీ ఆగర్భ శ్రీమంతుడు కాదు, గోల్డెన్ స్పూన్ తో కాదుకదా కనీసం వెండి స్పూన్ తో కూడ జన్మించ లేదు. ఈనాటి ఆనందమయ జీవితం కష్టపడి తను సాధించు కున్నదే!

నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, మనుబోలుపాడు గ్రామంలో చలమయ్య, లక్ష్మమ్మ పుణ్య దంపతులకు జన్మించారు.

ఆ గ్రామంలో పాఠశాల కూడాలేదు. దుండిగం అనే గ్రామానికి వెళ్ళి ఎలిమెంటరీ స్కూలు విద్యనభ్యసించారు. హైస్కూలు విద్యను రెసిడెన్షియల్ స్కూలు చదివారు. తర్వాత గవర్నమెంటు పాలిటెక్నిక్ కాలేజీలో EEE డిప్లమా పొందారు. తదనంతర కాలంలో కలకత్తా యూనివర్శటీ నుండి లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా AMIE డిగ్రీ పొందారు.

ఇంతకీ సుబ్బారావుగారు పై విషయాలు అన్నీ చెప్పారు కానీ తను పుట్టిన సంవత్సరం, వయసు చెప్పలేదు. ఒకప్పుడు ఆడపిల్ల వయసు అడగ కూడదు అంటారు. కానీ నేటి పరిస్థితుల్లో రివర్సై మగవాడి వయసు అడగకూడని స్థితి వచ్చింది. అందునా సుబ్బారావుగారి లాంటి వారు అస్సలు వయసు బయటకు తెలియ నివ్వరు.
కాలేజీ చదువు అయిపోయిన అనంతరం బ్రతుకు పోరాటంలో భాగంగా 2000 సంవత్సరంలో హైదరాబాద్ నగరం చేరారు.
హైదరాబాద్ చేరిన సుబ్బారావుగారు మొదట్లో ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో సూపర్ వైజర్ గ ఉద్యోగంలో చేరారు. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో సబ్ స్టేషన్లు, అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా కాంట్రక్టులు దిగ్విజయంగా చేశారు.
ఉద్యోగం చేస్తూనే విద్యుత్ రంగంలో చిన్న చిన్న కంట్రాక్టులు స్వంతంగా చేయడం అలవర్చుకున్నారు. తనకు కాంట్రాక్టు పనులు స్వంతంగా చేయగలననే నమ్మకం కుదిరాక ఉద్యోగం మానేసి స్వంత కంపెనీ “Unique Power Systems” స్థాపించారు.

నాటి నుండి కంపెనీ దినదిన ప్రవర్ధమానంగ వెలుగొందింది. ఒక చిరుద్యోగిగా మొదలైన సుబ్బారావుగారు నేడు అనేక మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.
2007వ సంవత్సరంలో నెల్లూరు వాసి అయిన శాంతిగారితో వివాహమైంది. దంపతులకు ఇద్దరు బొమ్మలు లాంటి చక్కని ఆడపిల్లలు. ఇది క్లుప్తంగా సుబ్బారావుగారి వ్యక్తిగత జీవితం.
ప్రవృత్తి పరంగ చూస్తే ఉంటుంది హైదరాబాద్ నగరంలో అయినా స్వంత మూలాలు మరచి పోకుండా తన గ్రామ పరిసర ప్రాంతాల పేద ప్రజలకు తను స్థాపించిన “రామిశెట్టి వెంకట సుబ్బారావు ఫౌండేషన్” ద్వారా నిత్యం ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వందలాది కుటుంబాలు స్వయం సమృద్థి సాధించుకునే దిశగా వారికి శిక్షణ నిస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
కాపు కులంలో జన్మించిన కులం రుణం తీర్చుకొనే దిశలో కాపు ఉద్యమామాలలో ముందు వరసలో నిలుస్తూ వచ్చారు.

కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారితో రిజర్వేషన్ ఉద్యమ కాలంలో కలసి పని చేశారు. హైదరాబాద్ లో కాపు రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతుగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆర్థికంగా సహాయ సహకారాలందించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కాపు ఉద్యమంపై నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు పాదం మోపి, కాపుల హక్కుల్ని కాలరాచి, తీవ్ర నిర్భంధం కొనసాగిస్తున్న రోజుల్లో హైదరాబాద్ లో ఆంధ్ర ప్రభుత్వ నిర్భంధ చర్యల్ని ఖండిస్తూ సభ నిర్వహించడంలో సుబ్బారావుగారు ప్రముఖ పాత్ర పోషించారు.

నేడు సోషల్ మీడియా రంగంలోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, ప్రజల్ని చైతన్య పరిచే దిశలో కృషి చేస్తున్నారు.

అటువంటి శ్రీ రామిశెట్టి వెంకట సుబ్బారావు జన్మ దినం నేడు!

శ్రీ రామిశెట్టి వెంకట సుబ్బారావుగారు రాజకీయంగా, వృత్తి పరంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలనీ, పేద ప్రజలకు, కాపు జాతికి నిరంతరం తన సేవలందించాలని…

ఇలాంటి పుట్టిన రోజులు నిండూ నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ……

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*