జగన్ అవినీతి వల్లె విద్యుత్ భారాలు రూ.1,29,000 కోట్లు

జగన్ అవినీతి వల్లె విద్యుత్ భారాలు రూ.1,29,000 కోట్లు

తాను అధికారంలో ఉన్న 2019- 24 సంవత్సరాలలో పది సార్లు నిర్హేతుకంగా విద్యుత్ చార్జీలు పెంచాడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెగ్యులేటరీ అథారిటీ ద్వారా పెంచిన చార్జీలే ఇప్పుడు అమలవుతున్నాయి. చార్జీలను తానే పెంచి సిగ్గు శరం లేకుండా ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా ధర్నాకు దిగాడు.

2014-19 మధ్య తెలుగుదేశ ప్రభుత్వం యూనిట్ విద్యుత్తును రూ.4.70కి కొంటే, జగన్ 2019-24 మధ్య రూ.7.61కి కొన్నాడు. ఆ భారాన్ని ఇప్పటివరకు జనం మోస్తూనే ఉన్నారు. తక్కువకే వచ్చే కరెంట్ ను ఎక్కువకు ఎందుకు కొన్నావ్? అని ధర్నా చేస్తున్న జగన్ ని జనం నిలదీయాలి.

ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన జగన్.. ఆరు నెలల్లోనే విద్యుత్ రంగం కోసం ధర్నాకి పిలుపు ఇవ్వడంపై జనం నవ్వుకుంటున్నారు.

* విద్యుత్ ఛార్జీల పెంపు పాపం.. జగన్దే

* నువ్వే చార్జీలు పెంచి.. నువ్వే ధర్నాలు చేయడం.. ప్రజలను మోసం చేయడమే కాదా..?

జగన్ అవినీతి, అసమర్థతతో జరిగిన నష్టం

వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32వేల 166 కోట్ల రూపాయలు

విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49 వేల 596 కోట్ల రూపాయలు

వీటీపీఎస్, కృష్ణపట్నం థర్మత్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యంతో నష్టం 12, వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు

పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యంతో నష్టం 4 వేల 737 కోట్ల రూపాయలు

స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2 వేల 691 కోట్ల రూపాయలు

ఏడాదికి 7000 మెగావాట్ల సోలార్ పవర్ (సెకి) నష్టం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు

అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంబై రెండు కోట్ల రూపాయలు

ఏపీ డీస్కంలు, ఏపీపీడీసీఎల్ నిర్వహణా వైఫల్యాలతో నష్టం 9 0 వేల 618 కోట్ల రూపాయలు

జెన్ కో ప్లాంట్లలలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం మూడువేల 135 కోట్ల రూపాయలు

ఆధారం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శ్వేతపత్రం

* 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో 2014లో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యింది.

* 2019లో టీడీపీ ప్రభుత్వం మిగులు విద్యుత్ను జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది.

* మిగులు విద్యుత్ పాలన ప్రారంభించి ఇతర రాష్ట్రాలకన్నా ఎక్కువ వనరులున్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి, కక్షసాధింపు విధానాలే కారణం.

* 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్లు భారం మోపారు.

* జగన్ రెడ్డి పాలనలో మైలవరం సోలార్ ప్లాంట్లపై దాడిచేసి ధ్వంసం చేశారు. చట్టవిరుద్దంగా పీపీఏలను రద్దు చేయడం వల్ల 7 వేల మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కొల్పొవడం జరిగింది.

* అలా కాకుండా వారిని ప్రోత్సహించి ఉంటే వారి అనుభవంతో మరో 10 వేల మె.వా ప్లాంట్లను ఈపాటికే ఉత్పత్తిలోకి తెచ్చి ఉండేవారు.

* దీని వల్ల రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా మిగులు విద్యుత్ రాష్ట్రంలో నేడు ఉండేది. ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని లాభపడి ఉండేది మనరాష్ట్రం.

* పోలవరం జలవిద్యుత్ కేంద్రం 2021కే పూర్తి చేయకపోవడం వల్ల రూ.4,737 కోట్ల నష్టం

* జెన్ కో విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడానికి విజయసాయిరెడ్డి సరఫరా చేసిన నాసిరకం బొగ్గు కారణం ఉంది. నాణ్యమైన బొగ్గు తగినంత నిల్వ పెట్టుకోనందుకు విద్యుత్ ఉత్పత్తి తగ్గింది.

* విద్యుత్ సంస్థలపై 49 వేల కోట్లకు పైగా అప్పు చేసినా ఒక కొత్త విద్యుత్ ప్లాంటును నిర్మించలేదు.

* నిర్మాణం పూర్తి అయి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న కృష్ణపట్నం, వీటీపీఎస్ లను సకాలంలో ప్రారంభించలేదు. దీన్ని కారణంగా చూపి విద్యుత్ కొరతను కావాలని సృష్టించి కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల రూ.2700 కోట్లు నష్టం వచ్చింది.

* ట్రాన్స్ ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలను కమిషన్లకోసం అధికరేట్లకు కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల నష్టం వచ్చింది.

* కూకట్ పల్లిలో హిందూజలకు చెందిన 10 ఎకరాలు జగన్ బినామీలు కొట్టేసి అందుకు బదులుగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోయినా, ఈఆర్సీ వద్దన్నా.. రూ. 1400 కోట్లు హిందుజలకు ధారాదత్తం చేశారు.

* అధిక వడ్డీ రేట్ల వల్ల రూ.10,892 కోట్లు నష్టం వచ్చింది.

* సెకి ఒప్పందంలో జగన్ రూ.1750 కోట్లు లంచాలు పుచ్చుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదు అయ్యింది.

* ఈ సెకి ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థలకు ఏడాదికి రూ.3850 కోట్లు మొత్తం 30 ఏళ్లకు లక్ష కోట్లు వినియోగదారులపై భారాలు మోపారు.

* ఇలా జగనే విద్యుత్ చార్జీలు పెంచి ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసగించడమే.

* నేడు రాష్ట్రంలో 20 వేల మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు చంద్రబాబు పాలనలో నిర్మించినవే. ఇందువల్లనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం.

* అలాగే ఎస్సీ, ఎస్టీ, కొన్ని బీసీ కులవృత్తిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నారు.

* ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*