శైవ క్షేత్రాల్లో చివరి కార్తీక సోమవార పూజలు.

శైవ క్షేత్రాల్లో చివరి కార్తీక సోమవార పూజలు...భక్తులతో పోటెత్తిన ఆలయాలు

కార్తీకదీప పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్న మహిళా భక్తులు..

భక్తులు పవిత్రంగా భావించే కార్తీకమాస చివరి సోమవారం సందర్భంగా పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

తెల్లవారుజాము నుండే దేవాలయాల్లో వేద పండితులు స్వామివారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించగా..వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గుడివాడలోని ప్రధాన ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం.. శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం.. శ్రీ ఆనందేశ్వర స్వామి వారి దేవస్థానం.. శ్రీ రామలింగేశ్వర దేవాలయల్లో తెల్లవారుజాము 4 గంటల నుండి నిరంతర దర్శనం కల్పించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దేవాలయాల్లో భక్తులు దీప పూజలు నిర్వహిస్తూ స్వామి వారికి తమ మొక్కులను తొలగించుకున్నారు. చివరి సోమవారం కావడంతో ఆలయాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహించుకునే మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని దేవాదాయ శాఖ అధికారి కందుల గోపాలరావు మీడియాకు తెలియజేశారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*