మద్యం మత్తులో గొడవ.. ఒకరి మృతి
ఎన్టీఆర్ జిల్లా.. ఆనందంగా గడపాల్సిన న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం మత్తు ఒకరి ప్రాణం తీసింది. విస్సన్నపేట(M) తెల్లదేవరపల్లిలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కారుమంచి రాంబాబు(27), విస్సంపల్లి సతీశ్ (22) ఘర్షణకు దిగారు. ఈక్రమంలో సతీశ్ రాంబాబుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన రాంబాబుని 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Be the first to comment