శరీరానికి తగిన శ్రమ చేస్తే అదే నిద్రపడుతుంది.

*చాలామందికి ఎందుకు సరిగా నిద్ర పట్టదు?*
6–7 గంటల నిద్రచాలు.

శరీరానికి తగిన శ్రమ చేస్తే అదే నిద్రపడుతుంది.

*వ్యాయామం చేస్తే చాలు.*

1.-బరువు ఎక్కువైనా నిద్రపట్టదు.
2.-బాధ్యతలు ఎక్కువైనా నిద్రపట్టదు.
3.-లక్ష్యం చేరుకోవాలన్న కసి నిద్రపోనివ్వదు.
4.-ఆహరం అరగక నిద్ర పట్టదు. అజీర్ణ వ్యాధి.
5.-ఆహారంలో మసాలాలు తిన్నా నిద్ర పట్టదు.
6.-వేడి చేసే వస్తువులు తిన్నా ఇదే పరిస్థితి.
7.-అనారోగ్యంతో నిద్రపట్టదు.
8.-బిజినెస్ అండ్ లాస్
అహంకారంతో నిద్రపట్టదు.
9.-నాలాగా కోరికలెక్కువైనా నిద్ర పట్టదు. ఒళ్ళూ, డబ్బూ గుల్లవుతాయి.
ఇంకా చాలా ఉన్నాయి.

*నిద్రలేమి అనేక కారణాల వల్ల వస్తుంది, ఇవి శారీరక, మానసిక, మరియు పర్యావరణ సంబంధిత కారణాలు ఉండవచ్చు*.

*ఒత్తిడి మరియు ఆందోళన…*. మానసిక ఉద్రిక్తత నిద్రను ప్రభావితం చేస్తుంది,

*పరిసర ప్రభావాలు…*. శబ్దం, వెలుతురు, ఉష్ణోగ్రత వంటి అనుకూలం కాని పరిస్థితులు

*ఆరోగ్య సమస్యలు….* నొప్పి, శ్వాస సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత

*ఔషధాల ప్రభావం…..* కొన్ని మందులు నిద్రను ప్రభావితం చేస్తాయి

*మానసిక ఆరోగ్య పరిస్థితులు…*. డిప్రెషన్, ఆందోళన సమస్యలు

*రాత్రి పని లేదా షిఫ్ట్ పనులు….* రాత్రి సమయంలో పని చేసే వారు సాధారణ నిద్ర ప్యాటర్న్ ను పాటించలేరు.

*అధిక కాఫీ మరియు ఆల్కహాల్…*. ఆల్కహాల్ లేదా కాఫీ వంటి ఉత్సాహపరచే పదార్థాల అధిక వినియోగం.

*భారీ భోజనం..*, నిద్రకు ముందు భారీ భోజనం చేయడం

*వ్యాయామ లోపం….* తగినంత శారీరక శ్రమ లేకపోవడం

*స్క్రీన్ సమయం….* పడుకునే ముందు ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం

*వయసు సంబంధిత మార్పులు…*. వయసు పెరిగేకొద్దీ నిద్రా నమూనాలు మారవచ్చు

*నిద్ర అలవాట్ల లోపం….* పగటి పూట నిద్రపోవడం, నిద్ర సమయానికి ముందు ఉత్తేజకరమైన కార్యకలాపాలు

*చుట్టుపక్కల శబ్దాలు…..* అధిక శబ్దం, మరియు పర్యావరణ కాలుష్య

*నిద్ర స్థలం అనుకూలం కాకపోవడం…..* అనుకూలమైన మంచం, దిండు లేకపోవడం.

*నిద్ర లేమి సహజ నివారణలు…*. రెండు గంటల ముందే ‘భోజనం చేయడo …..కాఫీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం…. రోజువారీ శారీరక కసరత్తులు చేయడం… గాఢమైన శ్వాస *వ్యాయామాలు…*.గంట ముందు స్క్రీన్ చూడకుండ ఉండడం … పాలు, తేనె మిశ్రమం…నిద్రకు ముందు వెచ్చని స్నానం చేయడం…. నిద్రకు ముందు హాయిగా పుస్తకం చదవడం లేక సంగీతం వినడం. నచ్చిన సువాసనలు పీల్బడం మొదలగునవి.

 

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*