అట్టహాసంగా అహుడ చైర్మన్ శ్రీ TC.Varun గారికి స్వాగతం…
అనంతపురము జిల్లా పొలిమేరల నుండి నాయకులు, జనసైనికుల సంబరాలు…
పూల వర్షం కురిపిస్తూ స్వాగత సుమాంజలులు
జోరు వర్షంలోనూ చెరగని అభిమానం…
భారీ గజమాలతో అఖండ స్వాగతం.
బాణాసంచా డప్పు వాయిద్యాలతో వేడుకలు చేసుకున్న జనసైనికులు…
ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో మా జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారి మార్క్ చూపుతాం.. అహుడ చైర్మన్ శ్రీ టీ.సి.వరుణ్ గారు..
తల్లిదండ్రులకు శ్రీ టి.సి.వరుణ్ గారు పాదాభివందనం…
దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి అనంతపురము జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నాయకులు, జనసైనికులను ఏకతాటిపై నడిపిన తమ అభిమాన నేత, జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారు అహుడ చైర్మన్ హోదాలో మొదటిసారి అనంతపురము జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. అహుడ చైర్మన్ శ్రీ టీ.సీ.వరుణ్ గారికి అట్టహాసంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంత జిల్లా పొలిమేరల లో ఉన్న బాటలో సుంకులమ్మ దేవాలయంలో శ్రీ టీ.సీ.వరుణ్ దంపతులు ప్రత్యేక పూజల అనంతరం భారీ కాన్వాయ్ తో ర్యాలీగా బయలుదేరారు. జాతీయ రహదారి పొడవున నాయకులు, జనసైనికులు పూల వర్షం కురిపిస్తూ.. స్వాగత సుమాంజులులు పలికారు.
భారీ గజమాలలతో అఖండ స్వాగతం..
అనంతపురము గుత్తి రోడ్డు ఐదులైట్ల సర్కిల్లో జనసేన నగర ఉపాధ్యక్షులు శ్రీ జక్కిరెడ్డి ఆదినారాయణ, శ్రీ గ్రంధి దివాకర్, జిల్లా కార్యదర్శి శ్రీ సంజీవ రాయుడు జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీ అవుకు విజయ్ కుమార్, శ్రీ ముప్పూరి కృష్ణ ఆధ్వర్యంలో గజమాలతో అఖండ స్వాగతం పలికారు. నగరంలోని అంబేద్కర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత భారీ ర్యాలీగా వస్తున్న శ్రీ టీ.సీ.వరుణ్ గారికి నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు గారి ఆధ్వర్యంలో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలవేసి విశేష స్వాగతం పలికారు.
యువనేత శ్రీ టీ.సీ.వరుణ్ గారికి విద్యార్థుల ఘన స్వాగతం.
యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ నేత శ్రీ టి.సి.వరుణ్ గారు అహుడ చైర్మన్ హోదాలో అనంతకు వచ్చిన సందర్భంగా విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్థానిక గుత్తి రోడ్డు నారాయణ కళాశాల వద్ద జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం శ్రీ సిద్దు, శ్రీ వెంకట సాయి, విద్యార్థి నాయకులు శ్రీ పాపిరెడ్డిపల్లి పృథ్వి, శ్రీ వినోద్ లు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జై పవన్ కళ్యాణ్… టీ.సీ.వరుణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గుత్తి రోడ్డు ప్రాంగణమంతా హోరెత్తించారు.
వరుణుడిని వెంటపెట్టుకొచ్చిన శ్రీ టీ.సి.వరుణ్ గారు.. జోరు వర్షంలోనూ చెరగని అభిమానం…
అనంతపురము నగరంలోని శ్రీకంఠం సర్కిల్ లోకి అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారి భారీ ర్యాలీగా చేరుకోగానే వర్షం ప్రారంభమైంది. వరుణుడిని శ్రీ టి.సి.వరుణ్ గారు వెంట పెట్టుకొచ్చారని జనసైనికులు, అభిమానులు జోరు వర్షంలోనూ చెరగని అభిమానంతో డప్పు వాయిద్యాలకు చిందులు వేశారు. అంత భారీ వర్షంలోనూ కార్యకర్తలు చెక్కుచెదరకుండా శ్రీ టి.సి.వరుణ్ గారు స్వగృహం వరకు ర్యాలీలో కొనసాగడం విశేషం.
ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్క్ చూపుతాం.. అహుడ చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు…
ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించే అహుడా సంస్థ అభివృద్ధిలో తమ అధినేత, మా దేవుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి మార్క్ చూపిస్తామని చైర్మన్ టీ.సి.వరుణ్ గారు మీడియా ముఖంగా తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానన్నారు. అనంతపురము నగర అభివృద్ధి విషయంలో అందర్నీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని, కూటమినేతల పరస్పర సహాయ సహకారాలతో విశేష అభివృద్ధికి బాటలు వేస్తామని శ్రీ టీ.సీ.వరుణ్ గారు పునరుద్గాటించారు.
అమ్మానాన్న ఆశీస్సులు..
అహుడా చైర్మన్ గా నియమితులైన అనంతరం అనంతపురము లోని తన స్వగృహానికి భారీ ర్యాలీగా చేరుకున్న శ్రీ టీ.సీ.వరుణ్ గారికి వీరమహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ టి.సి.వరుణ్ గారు తల్లిదండ్రులు శ్రీ టీ.సి.నీరజ, శ్రీ టి.సి.కిషోర్ లకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ టి.సి.వరుణ్ గారికి తల్లిదండ్రులు మిఠాయి తినిపించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు మెగా అభిమాన సంఘ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Be the first to comment