పవన్ కళ్యాణ్ చిత్రాలతో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఛాయా చిత్రాలతో పార్టీ నాయకురాలు శ్రీమతి బార్లపూడి (ముద్రగడ) క్రాంతి గారు రూపొందించిన 2025 క్యాలెండర్ ను శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి క్రాంతితోపాటు ఆమె భర్త శ్రీ బార్లపూడి రవికిరణ్ గారు పాల్గొన్నారు.

శ్రీమతి క్రాంతి దంపతులు ఈ క్యాలెండర్ ను వినూత్నంగా డిజైన్ చేయించారు. ప్రతి పేజీలో పార్టీ ప్రస్థానంలో ముఖ్యమైన సభలు, కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. వాటితోపాటు క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా- ఆ చిత్రానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ఓపెన్ అయ్యేలా క్యాలెండర్ రూపకల్పన చేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*