మన రాజధాని… మన అమరావతి

*భవన నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు* *అవసరం లేదు : పురపాలక శాఖ మంత్రి నారాయణ*

గుంటూరు: భవన నిర్మాణాల కోసం ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులన్నీ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, వరదనీరు, ఘనవ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాతపన్ను బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆచార్య నాగార్జున వర్సిటీలో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. దీనికి 123 మంది పురపాలక కమిషనరు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి
నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు, కాకినాడ, రాజమండ్రిలో ఘనవ్యర్థాల నిర్వహణకు అనుమతి వచ్చిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో చెత్త సమస్య పరిష్కారమవుతోందని చెప్పారు.

మన రాజధాని… మన అమరావతి….

2014-2019 మధ్య మున్సిపల్ శాఖ పనితీరు
అద్భుతంగా ఉంది. ఈ సమయంలో మున్సిపల్ పన్నులు రూపాయి కూడా పెంచలేదు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మున్సిపల్ నిధులను పక్కదారి పట్టించింది. ప్రస్తుతం పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. సీఎఫ్ఎంఎస్ సంబంధం లేకుండా మున్సిపాలిటీలకే నిధులు కేటాయిస్తాం. 123 మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖలో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. ఆధునిక సాంకేతికత విధానంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడతాం. వివిధ రాష్ట్రాలు మన నిర్మాణ సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి” అని నారాయణ తెలిపారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*