12వ తేదీ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవాలు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం లో వెలసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతి ఉత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మటమ్ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ తెలిపారు. 13వ తేదీ స్వామి వారు అవతరించిన పవిత్ర దినం సుదినం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉదయం 416 కలశాలతో ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బ్రహ్మం గారి కృపకు పాత్రులు కావాలని వారి విజ్ఞప్తి చేశారు.


Be the first to comment