అప్పిచ్చు వాడు వైద్యుడు! కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు

అప్పిచ్చు వాడు వైద్యుడు!
కాఫీ కప్పిచ్చు వాడు సర్వరుడు!
తిని టిప్పిచ్చు వాడు కస్టమరుడు!
కరీం బీడీకి నిప్పిచ్చు వాడు నిజమగు మిత్రుడు!
బాకీ తీర్చక తిప్పిచ్చువాడు బతక నేర్చినవాడు!
వండి పెళ్ళామును మెప్పిచ్చు వాడు అసలు మొగుడు!
మామిడికాయ పప్పులో ఇంగువ గుప్పిచ్చు వాడు గొప్ప వంటగాడు!
ముప్పూటా స్విగ్గీ తెప్పిచ్చువాడు భార్యా బాధితుడు!
ఇంట్లో ఉండీ లేడని చెప్పిచ్చువాడు దేశ ముదురుడు!
పాటకు లిప్పిచ్చు వాడు కథానాయకుడు!
పోస్టులందు హాస్యము చొప్పిచ్చువాడు మేటి రాతగాడు!
ప్రేయసి మనసు నొప్పిచ్చువాడు ఆధునిక ప్రియుడు!
ప్రియురాలిని ఒప్పిచ్చువాడు పాత కాలపు ప్రేమికుడు!
ఆపద తప్పిచ్చు వాడు భగవంతుడు!
కాలము తీరినంత పైకి రప్పిచ్చు వాడు యమకింకరుడు,
మొబైలే లేని వాడు దైవ స్వరూపుడు
వాట్సప్ లేనివాడు యోగీశ్వరుడు
ఉండీ ఫార్వర్డ్ లు చేయనివాడు ధృఢచిత్తుడు
కదరా సుమతీ!

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*