శ్రీకాకుళం: తెలగ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి మాజీ మంత్రి పది లక్షల విరాళం.
శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సంక్షేమ సంఘ భవనానికి తన తండ్రి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు త్రిపురాణ రాఘవ దాస్ జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ మంత్రి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నం తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలగ సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్ననాటి నుండి తన తండ్రి పేదలకు సహాయం చేయాలని సూచించడంతో సహాయం చేయడం అలవాటుగా మార్చుకున్నానని ఆమె చెప్పారు. మున్ముందు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించాలని ఆమె సూచించారు. జిల్లా తెలక సంఘం ఆధ్వర్యంలో వెంకటరత్నంను ఘనంగా సన్మానం చేశారు. జిల్లా తెలుగు సంఘం నూతన అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి నాయుడు, తెలగ సంఘ ప్రముఖ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.


Be the first to comment