పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని..
క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్నీ పరిశీలించాకే చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మాట్లాడుతూ..“మరో గిడ్డంగిపైనా అనుమానం ఉంది.. తనిఖీ చేస్తాం. 243 టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. వ్యవస్థను ఎంతగా ఖూనీ చేశారో ప్రజలు గ్రహించాలి. ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని పదేపదే చెబుతున్నాం. నిజాయతీగా పనిచేస్తాం. తప్పు చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు” అని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో ఇప్పటికే 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోడౌన్ లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయి. దీనికి సంబంధించి పేర్ని నాని సతీమణి జయసుధపై అధికారులు కేసు నమోదు చేశారు.


Be the first to comment