జాతీయస్ధాయిలో హెడ్ కానిస్టేబుల్ కుమారుడి ప్రతిభ.

జాతీయస్ధాయిలో హెడ్ కానిస్టేబుల్ కుమారుడి ప్రతిభ.

జాతీయ స్ధాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీలలో ఆంధ్రప్రదేశ్ కి మొదటిసారి స్వర్ణం.

క్రీడాకారులను అభినందించిన….జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు.

జాతీయ స్ధాయిలో ఢీల్లీ లో జరిగిన కరాటే అండర్-17 (66 కిలోల విభా గం) పోటీలలో కర్నూలు సిసియస్ విభాగంలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వాసు కుమారుడు మన్నెపు వెంకట దినేష్ స్వర్ణం సాధించాడు.

ఈ గేమ్స్ లలో కర్నూలు జిల్లాకు చెందిన కె. హవీష్, పి. హేమంత్ కుమార్ రెడ్డి, సాయి అక్షిత, రుషికేశ్, యస్మిత లు వెండి, కాంస్యం పతకాలు సాధించారు.

ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు క్రీడాకారులను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కర్నూలు జిల్లా కు మంచి పేరు , ప్రఖ్యాతులు సాధించిన క్రీడాకారులను పోలీసు అధికారులు , సిబ్బంది అందరూ అభినందించారు.

అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

జాతీయ స్ధాయి స్కూల్ గేమ్స్ ఢీల్లీలో డిసెంబర్ 9 న ప్రారంభమై డిసెంబర్ 15 న ముగిశాయి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*