టీటీడీ నిర్ణయాలివే

శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్ లో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ నిర్ణయాలివే..

• 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ లో విడుదల.

• 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టోకెన్లు ఆన్లైన్ లో విడుదల.

• జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు.

• తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.

• టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం.

• టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్లు లేని భక్తులను దర్శన క్యూలైన్లలోకి అనుమతించరు.

• వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభం.

• వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు.

• వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం.

• వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.

• గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.

• వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన.

• ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం.

• టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలని నిర్ణయం.

• లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*