వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
108 ఎకరాల ప్రభుత్వ భూమి పేదప్రజల దగ్గరనుండి కొనుగోలు చేసిన విజయవాడకు చెందిన ప్రైవేటు వ్యక్తులు సి రామ శైలజ కెవిపి బసవేశ్వర రావు జి రవీంద్రనాథ్ బి ప్రభావతి మరియు త్రిపురనేని రాఘవ ప్రసాద్
కొండూరు గ్రామం లేపాక్షి మండలం అనంతపురం జిల్లా లో పేద ప్రజలకు పంచిన ప్రభుత్వ భూమిని అక్రమంగా కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని అనంతపురం జిల్లా చిలుమత్తూరు కు చెందిన టి గోపాలకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
ప్రభుత్వ భూమిని పేదలకు పంచామన్న నేపంతో వందల కోట్ల విలువైన భూమిని రాజకీయ పలుకుబడితో ప్రవేటు వ్యక్తులు పేరిట అధికారులు బదలాయించారన్న పిటీషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
ప్రైవేటు వ్యక్తుల పేరిట పేరిట బదలాయించబడిన భూమి ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమి గానే నమోదయిందన్న పిటీషనర్ న్యాయవాది
పిటిషనర్ వాదనను సమర్థిస్తూ 600 పేజీల ఆధారాలు హైకోర్టు సమర్పించిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
వందలాది అసైన్మెంట్ భూములు పేద ప్రజలను మోసం చేస్తూ కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం అన్న న్యాయవాది శ్రవణ్ కుమార్
న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం
తక్షణమే ప్రతివాతలు అందరికీ నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు
ప్రిన్సిపల్ సెక్రెటరీ పంచాయతీరాజ్, రెవిన్యూ మరియు జిల్లా కలెక్టర్ ను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశాలు
విచారణ నాలుగు వారాలకు వాయిదా


Be the first to comment