అక్రమ ఇడుపుల పాయ ఎస్టేట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనిడిమాండ్ .

. అక్రమ ఇడుపుల పాయ ఎస్టేట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాసరావు డిమాండ్ . దళితులకు చెందిన 850 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసి ఇడుపులపాయ ఎస్టేట్ ను నిర్మించాను అని , గతంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అసెంబ్లీ లో ప్రస్తావించారు కనుక, వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పురి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సుమారు 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై నేటికీ చర్యలు తీసుకోలేదు అని పేర్కొన్నారు. అదేవిధంగా సరస్వతి పవర్ పేరుతో సిఎం రాజశేఖరరెడ్డి రైతుల, ప్రభుత్వ, అటవీ భూములను 2008 లో 1600 ఎకరాల భూమిని కబ్జా చేశారు అని, సరస్వతి భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాసరావు లేఖలో డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు కబ్జా చేసే అధికారం ముఖ్యమంత్రి కి కూడా లేదు అని, చట్టం అందరికీ సమానం అని, చట్టం సిఎం కు చుట్టం కాదు అని శ్రీనివాసరావు లేఖలో వివరించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*