ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు కాకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు

ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు కాకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు: తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య

ముగియునున్న ఎమ్మెల్సీ ఓట్ల దరఖాస్తుల స్వీకరణ

ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుకు నవంబర్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి నవంబరు 23న ముసాయిదా జాబితా ప్రకటించారు. దీనిపై డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని తాడేపల్లి తహసిల్దార్ డి.సీతారామయ్య అన్నారు.

ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా తాడేపల్లి(రూరల్) మండలంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రచురణ చేయడం జరిగిందని అన్నారు.06.11.2024 వరకు వచ్చిన క్లెయిములను విచారించి అర్హత కలిగిన అర్జీ దారులను డ్రాఫ్ట్ జాబితా నందు ఓటర్లుగా చేర్చడం జరిగిందని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఓటర్ల నమోదు అధికారి జిల్లా రెవిన్యూ అధికారి గుంటూరు తహశీల్దార్, తాడేపల్లి మండలం వారి కార్యాలయములో అందుబాటులో ఉంటాయని అన్నారు.కావున ప్రజలు తమ జాబితాను పరిశీలించుకుని
సదరు జాబితా పై అభ్యంతరములను ఫారం 7 నందు, సవరణ కొరకు ఫారం 8 నందు ఓటు నమోదు కొరకు ఫారం 18 నందు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించుటకు చివరి తేది. 09.12.2024 అని అన్నారు.

కొత్తగా నమోదుకు అవకాశం

2021 నవంబర్‌ 1వ తేదీలోపు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని
అన్నారు.ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎమ్మెల్సీ ఈ-రిజిస్ట్రేషన్‌ 2024 క్లిక్‌ చేసి దానిలోని ఫారం 18ని పూర్తి చేసి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*