జన సైనికుడు కుటుంబానికి, 5 లక్షల రూపాయలు అందజేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

ఆమదాలవలస నియోజకవర్గం జన సైనికుడు కుటుంబానికి, 5 లక్షల రూపాయలు అందజేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

మన ఆమదాలవలస నియోజకవర్గంలో, రోడ్డు ప్రమాదములో ప్రాణాలు కోల్పోయిన, బూర్జ మండలం, హన్నమయ్యపేట గ్రామంకి చెందిన దుద్ది రాజు అనే జనసైనికుడు చనిపోయారు, కావున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం తో జనసేనపార్టీ అధ్యక్షులు గౌll *శ్రీ పవన్ కళ్యాణ్* గారు ఆదేశాను ప్రకారం, జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, శ్రీ నాదెండ్ల మనోహర్* గారు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పీసిని చంద్రమోహన్ గారు, ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ గారు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి శ్రీ కోరుకొండ మల్లేశ్వరరావు (KMR) గారు సమక్షంలో, వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి దుద్దిరాజు గారు కుటుంబానికి 5 లక్షలు భీమా చెక్కునీ అందజేయడం జరిగింది. మరియు ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బూర్జ మండలం అధ్యక్షులు శ్రీ కొత్తకోట నాగేంద్ర, కొల్ల జయరాం(జిల్లా ప్రధాన కార్యదర్శి), పైడి మురళీమోహన్ (సరుబుజ్జిలి మండలం అధ్యక్షులు), గార బాబురావు( ప్రోగ్రాం కమిటీ మెంబర్) కీర్తి సుశీల (సంయుక్త కార్యదర్శి) మరియు ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

_జనసేన పార్టీ కార్యాలయం
ఆముదాలవలస నియోజకవర్గం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*