డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవా రత్న పురస్కారం అందుకున్న మొగురం రమేష్…
సుధా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ రవీందర్ సింగ్ చేతుల మీదుగా స్వీకరణ….
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవ రత్న పురస్కారంను సుడా చైర్మన్ కొమిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ సర్దార్ రవీంద్ర సింగ్ చేతుల మీదుగా జన సైన్యం పత్రిక ఎడిటర్ గుండ్లపల్లి స్వామి ఆధ్వరంలో సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ తేజ ఎడిటర్ మొగురం రమేష్,అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు శాలువా కప్పి , అవార్డు పత్రం, మేమొంట్ అందజేశారు. ఆదివారం కరీంనగర్ లోని టీఎన్జీవో భవన్ లో జన సైన్యం పత్రిక వార్షికోత్సవ సందర్భంగా , వివిధ రంగాలలో కృషి చేసిన వారికి ఈ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, విద్యావేత్త ఫాతిమారెడ్డి, ఉపాధ్యాయులు, మేధావులు, సీనియర్ జర్నలిస్టు లు ప్రమోద్ కుమార్, బొంకురి మధు, ప్రేమ్ కుమార్, సదానందం, విజయ శంకర్, విద్యార్థి సంఘం నాయకులు కే తిరుపతి మహిళలు, జన సైన్యం, పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


Be the first to comment