పవన్ కళ్యాణ్ గారిపై మంద కృష్ణ మాదిగ గారి వ్యాఖ్యలను ఖండించిన కోటిపల్లి కాలం

  • కుల చిచ్చు రాజకీయాలు చేయొద్దు అని మనవి
  • ఎన్డీయేలో భాగస్వామ్యం ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
  • మంద కృష్ణ మాదిగ గారు ఒక కులం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటంలో మేము కూడా చేయి కలిపాం.. మీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ గారు పెట్టిన అనేక మీటింగ్స్ మేము కూడా వచ్చి సంఘీభావం తెలియచేసేవాళ్ళం మీరు అంటే ఎనలేని గౌరవం ఉంది.
  • మీరు సమాజంలో కొన్ని కులాల ప్రయోజనాలకు మాత్రమే మీరు పోరాటం చేశారు విజయం సాధించారు సంతోషం.
  •  వైసిపి ప్రభుత్వం లో దళిత మహిళల మీద జరిగిన దాడులు మీకు తెలియనివి కావు ఆనాడు కనీసం మీరు నోరు మెదపలేదు. మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ఏనాడు ఖండించలేదు.
  • అధికారం కోల్పోయిన వైసిపి విలవలకు త్రిలోదకాలు వదిలి ఒక అరాచకశక్తి లాగ తయారయ్యి కూటమి ప్రభుత్వంపై అడుగడునా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా లను వేదికగా చేసుకుని విష ప్రచారాలు చేస్తుంది ఎన్డీయేలో భాగస్వామ్యం మీరు ఆ విష ప్రచారాలను ఖండించలేదు.
  • రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆనాడు వైసిపి చేసిన అరాచకాలను వదిలేస్తే ప్రజలు మనల్ని క్షమించరు అని వాటిపై చర్యలు తీసుకోవాలని ఘాటుగానే చెప్పారు.. దానికి మీరు కులం రంగు వేసి కుల రాజకీయాలు చేయడం ఎంత వరకూ కరెక్టు చెప్పండి.
  • ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి లాగే అన్ని శాఖల మంత్రులపై సర్వాధికారాలు ఉంటాయి. నిన్న ఒక మంత్రి గారిని పని తీరు మెరుగుపర్చుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది అన్ని మీడియాలలో వచ్చింది దానికి కారణం ప్రజల కోసం నాయకులు పని చేయాలనే కదా చెప్పింది.
  • మీరు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రకం రాజకీయం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు పని భాగోకపోతే అడిగే అధికారం కూడా లేకుండా మీలాగే రేపు మా కులపు మంత్రిని, ఎమ్మెల్యేలను అవమానించారు అని రోజుకో కులం రోడ్డు ఎక్కేలా కొత్త రకం కారు చిచ్చుకు ఆద్యం పోస్తున్నారు. సమాజం అంటే ఒక కులం కాదు అన్ని కులాల సముదాయం అని మీరు గమనించాలి. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.
  • ప్రజా క్షేత్రంలో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అందుకే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పారు. కండ కావరంతో అసురులుగా మారి స్త్రీల మానప్రాణాలపై బరితెగించి వ్యాఖ్యలు చేసి వారిని చంపేస్తాం అన్న అసురులను దండించాలి మీరు దండించకుండా వదిలేస్తే ప్రజలు మనల్ని క్షమించరు అని మీరు దయ గుణంతో ఉంటే ఆ శాఖను నేను తీసుకుని అసుర ప్రక్షాళన చేస్తానని చెప్పారు దానిలో అవమానం మీకు ఏమి కనిపించింది చెప్పండి… మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీ విలువ మీరే పోగొట్టుకుంటున్నారు.
  •  పవన్ కళ్యాణ్ గారి ఆశయం కుల రహిత సమాజ నిర్మాణం చేయడమే… ఆయన కులం లేని సమాజం కోసం రాజీ లేని పోరాటం చేస్తున్నారు మీరు ఆయన చేస్తున్న పోరాటాన్ని సహకారం అందించకుండా కుల చిచ్చు పెట్టాలని చూడడం మేము ఖండిస్తున్నాం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*