అభినవబ్రహ్మ నరేంద్ర మోదీ ..అప్పిశెట్టి ఉదయ శంకర్
భారతీయ జనతా పార్టీ గిద్దలూరు పట్టణ అధ్యక్షులు
అత్యాధునిక అభివృద్ధికై పరుగులు పెడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కి 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించడం విషయమని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సకల సౌకర్యాలతో విద్యా బోధనకు సర్వ సాంకేతిక హంగులతో ఏర్పాటు చేయనున్న 8 కొత్త కేంద్రీయ విద్యాలయాల ద్వారా 7680 మంది నూతనంగా విద్యను అభ్యాసించుటకు మరియు 504 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం ఏర్పడబోతుందని ఉదయ శంకర్ పేర్కొన్నారు. అభినవబ్రహ్మ మాదిరిగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారి చల్లని చూపు ద్వారా విద్య అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త శిఖరాలకు చేయబోతుందని పేర్కొన్నారు అఖండ, అపూర్వ, అద్భుత, ఆదర్శ భారతదేశం భారతదేశం రూపకల్పనకు నరేంద్ర మోదీ తన జీవితాన్ని అంకితం చేశారని ఉద్ఘటించారు.
ఈ సందర్భంగా అప్పిశెట్టి ఉదయ శంకర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి ఆంధ్రప్రదేశ్ కి ప్రకటించిన 8 కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి గిద్దలూరు పట్టణానికి మంజూరు చేయించాలని అభిలాషిస్తూ గిద్దలూరు పట్టణానికి కేంద్రీయ విద్యాలయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సాధించేందుకు కృషి చేస్తామని ఉదయ్ శంకర్ తెలిపారు.
విశ్వశాంతికై అనిర్వచనీయమైన కృషి చేస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని త్వరలో సహకారం చేయగలరని విశ్వసిస్తున్నామని ఉదయ్ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు.


Be the first to comment