మహానటి సావిత్రి విద్యాలయంలో ఘనంగా సావిత్రి పుట్టినరోజు వేడుకలు

మహానటి సావిత్రి విద్యాలయంలో ఘనంగా సావిత్రి పుట్టినరోజు వేడుకలు

రేపల్లె మండలం , వడ్డివారిపాలెం, : రేపల్లె మండలం వడ్డివారిపాలెం లో మహానటి సావిత్రి స్థాపించిన శ్రీమతి సావిత్రి గణేష్ జెడ్పి ఉన్నత పాఠశాల లో మహానటి సావిత్రి 89 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ కోట సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, సాహిత్య విమర్శకులు సవరం వెంకటేశ్వరరావు, ప్రముఖ విద్యాసంస్థల అధినేత కొండవీటి ఈశ్వరరావు , వడ్డి హనుమంతరావు తదితరులు ప్రధానంగా పాల్గొన్నారు.
శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మహానటి సావిత్రి కళాపీఠం సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథి కోట సుబ్రహ్మణ్యం తన అమూల్యమైన సందేశాన్నిచ్చారు.
సదాశయంతో విద్యాలయాన్ని నెలకొల్పిన సావిత్రమ్మ ఆశయాలను, ఆకాంక్షలను అమలు పరుస్తూ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు.
సావిత్రమ్మ స్థాపించిన పాఠశాలలో విద్యనభ్యసించి ఎంతోమంది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ కొలువుల్లో ఉన్నత స్థాయిలో ఉండడం సంతోషదాయకం అన్నారు.
వ్యాపార రంగంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని అభిలషించారు. మహిళా సాధికారతకు అవసరమైన శిక్షణను అందించేందుకు తమ సంస్థల తరపున సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలనే పొందాలని సమయం వృధా చేసుకోవద్దన్నారు. వ్యాపార రంగంలో ప్రవేశించాలన్నారు. అభిరుచికి తగిన రంగాన్ని ఎంచుకొని రాణించాలని యువత ఆ దిశగా కృషి చేయాలన్నారు.
విద్యాలయానికి దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థిని, విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్సుకు గత సంవత్సర కాలంగా డీజిల్ (ఇంధనం ) నిమిత్తం ప్రతి నెల రూ. 70 వెల కర్చును మరొక రెండు సంవత్సరాలు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వడ్డీ వారి పాలెం గ్రామస్తులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్ర ఉపన్యాసకులు సవరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
తాత, తండ్రులకు జన్మనిచ్చిన ఈ గడ్డపై మమకారం తో ఖండాంతరాలలో స్థిరపడినా… ఒట్టి మాటలు కాదు గట్టి మేల్ తలపెట్టాలనే తలంపుతో బస్సు ఇంధనం కు అయ్యో ఖర్చు భరిస్తూ తన వితరణతో చుట్టు పక్కల ఇరవై గ్రామాల విద్యార్ధినీ విద్యార్ధులు చదువుకోవటానికి సహకరిస్తున్న కోట సుబ్రహ్మణ్యం చరితార్ధురాలైన మహానటి సావిత్రి ఆశయానికి ఊపిరి పోస్తున్నారు అని ప్రశంసించారు. ప్రశ్నించటం ద్వారా జిజ్ఞాస పెంచుకోవటం విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. కొండవీటి ఈశ్వరరావు మాట్లాడుతూ ఉన్నతమైన ప్రమాణాలతో విద్యను అందిస్తూ శ్రీమతి సావిత్రి గణేష్ ఉన్నత పాఠశాల ఖ్యాతికి విశేష కృషి చేస్తున్న విద్యాలయ సిబ్బందిని అభినందించారు. మహానటి సావిత్రి కళాపేతం వ్యవస్థాపక అధ్యక్షులు బడే ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రి లోని సేవాభావం అజీరామారం అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వడ్డీ వారి పాలెం గ్రామ సర్పంచ్ లక్ష్మోజి , విశ్రాంత సబ్ రిజిస్టార్ సాయిబాబు, ప్రధానోపాధ్యాయిని మాధవి, చంటి , కోట వెంకట సుబ్బారవు, పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొని మహానటి సావిత్రి పుట్టినరోజు సందర్భంగా విద్యాలయ ప్రాంగణంలోని ఆమె కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
విద్యార్థులు ఆలపించిన గీతాలు, ప్రసంగాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించారు. మహానటి సావిత్రి జ్ఞాపికను బహుకరించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*