కర్నూలు నగర బలిజ సంఘం
కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధుల ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి మరియు పట్టాభిషేక మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలన్న డిమాండ్ ను తీసుకు వెళ్ళిన కర్నూలు నగర బలిజ సంఘం
స్వచ్చంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి కర్నూలు కు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి దృష్టికి గౌరవ కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ T.G. భరత్ గారు, పాణ్యం MLA శ్రీమతి గౌరు చరిత గారు, కోడుమూరు MLA శ్రీ బొగ్గుల దస్తగిరి గారు, కర్నూలు MP శ్రీ బస్తిపాటి నాగరాజు గారు, నంద్యాల MP శ్రీమతి డా. బైరెడ్డి శబరి గారు, శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి మరియు పట్టాభిషేక మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు గా నిర్వహించాలన్న కర్నూలు నగర బలిజ సంఘం వారి డిమాండ్ ను తీసుకువెళ్ళి, ఆ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కర్నూలు నగర బలిజ సంఘం వారి వినతిపత్రాలు అందజేసారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కర్నూలు జిల్లా పర్యటన ఖరారు అయింది అని తెలిసిన వెంటనే మూడు రోజుల పాటు కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు శ్రీ గాండ్ల లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి శ్రీ మండ్లెం రవికుమార్, ప్రధాన సలహాదారులు డా.సింగంశెట్టి సోమశేఖర్, ఉపాధ్యక్షులు శ్రీ ఈశ్వర్ కుమార్ లు కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖామాత్యులు శ్రీ T.G. భరత్ గారిని, పాణ్యం MLA శ్రీమతి గౌరు చరిత గారిని, కోడుమూరు MLA శ్రీ బొగ్గుల దస్తగిరి గారిని, కర్నూలు MP శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని మరియు నంద్యాల MP శ్రీమతి డా. బైరెడ్డి శబరి గార్లను వారి కార్యాలయాలలో కలసి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి మరియు పట్టాభిషేక మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు గా నిర్వహించాలన్న డిమాండ్ ను తెలియజేసి, ఆ విషయాన్ని కర్నూలు కు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి బలంగా తీసుకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేసి, ఆ మేరకు వారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విడివిడిగా రాసిన వినతిపత్రాలు అందజేసారు. అలాగే సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేదిక మీద మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని తమ ప్రసంగంలో భాగంగా ప్రస్తావించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు అందరూ చాలా బాగా స్పందించి తప్పక విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, వారికి వినతిపత్రాలు అందజేసి ఒప్పిస్తామని, తమ ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలియజేసారు.
ముఖ్యమంత్రి గారి పర్యటన అనంతరం విచారించగా ప్రజాప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయం తీసుకుని వెళ్ళి వినతిపత్రాలు అందజేసినట్లు, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పక ప్రకటన చేద్దామని హామి ఇచ్చినట్లు తెలిసింది.


Be the first to comment