45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 19 ఇన్స్టిట్యూట్లకు రూ.61.6లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి బీఎల్ వర్మ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.


Be the first to comment