రక్తదాతే ప్రాణదాత..
ఈ మాటను నిజం చేసిన శ్రీ పిల్లా అయ్యప్ప ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు…
APollo హాస్పిటల్ లో అత్యవసరంగా O +ve ప్లేట్లెట్స్ అవసరం అని పరిస్థితి చెప్పగానే *హైదరాబాద్ లోని అమీన్ పూర్ వాస్తవ్యులు శ్రీ అయ్యప్ప ప్రసాద్ గారు వెంటనే స్పందించి 40 ని•లలో Blood Bank కు చేరుకున్న తీరు ఎంతో అభినందనీయం .
సాటి మనిషిని ఆదుకునేది & ప్రాణాలు కాపడేది మనమే అని నమ్మి మానవత్వంతో స్పందించి Patient కి అవసరమైన ప్లేట్లెట్స్ అత్యవసరంలో శ్రీ అయ్యప్ప ప్రసాద్ గారు అందించారు.
శ్రీ చిరంజీవి గారి ఆదర్శాలను పాటిస్తూ వారి బాటలో నడిచే శ్రీ అయ్యప్ప ప్రసాద్ గారు ఇప్పటివరకు 10 సార్లు చిరంజీవి బ్లడ్ సెంటర్ లో Platelets donation చేశారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం.
CCT & బయట Blood Banks కలుపుకుని మొత్తం 48 సార్లు రక్తదానం చేసిన గొప్పమనసున్న మానవతావాది.
వారి ఉన్నతమైన మనస్తత్వానికి మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి తరపున అభినందనలు తెలియజేస్తున్నాం.
శ్రీ పిల్లా అయ్యప్ప ప్రసాద్ గారికి , వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
-చిరంజీవి బ్లడ్ సెంటర్


Be the first to comment