అట్టహాసంగా సుడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం
శ్రీకాకుళం జిల్లా కేంద్రం 80 ఫీట్స్ లో భారీ ఏర్పాట్లు
మన కాపు జాతి ముద్దుబిడ్డ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ గా జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొరికాన రవికుమార్ ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జిల్లా కేంద్రం 80 ఫీట్స్ రోడ్డు ఆనందమయి ఫంక్షన్ హాల్ వద్ద చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రేపు డిసెంబర్ 5 గురువారం ఉదయం 11 గంటలకు రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీగా అభిమానులు, కూటమి నాయకులు, స్నేహితులు రానున్న నేపథ్యంలో 5 వేల మంది ఉండేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు రవికుమార్ విశాఖపట్నంలోని విమానాశ్రయంలో దిగుతారు. అనంతరం అభిమానులు, స్నేహితులతో భారీ ర్యాలీగా శ్రీకాకుళం జిల్లా ఎంట్రన్స్ పైడిభీమవరం చేరుకుంటారు. అక్కడ నుండి మరి కొంతమంది కూటమి నాయకులు అభిమానులు రవికుమార్ కు స్వాగతం చెబుతారు.300 కార్లు,100 బైకులతో ర్యాలీ హైవే మీదుగా శ్రీకాకుళం సింహద్వారం గుండా డే & నైట్ జంక్షన్ కు ప్రవేశించి ఆనందమయి ఫంక్షన్ హాలుకు చేరుకొంటారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణితో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శాసనసభ్యులందరూ హాజరుకానున్నారు.ప్రమాణ స్వీకారానికి వచ్చే వారందరికీ 12 రకాల వంటకాలను భోజనాలలో వడ్డించేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వంట మాస్టర్లను సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆధ్వర్యంలో చురకుగా సాగుతున్నాయి.


Be the first to comment