కందుకూరు నియోజకవర్గ నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికైన అధ్యక్షులు సభ్యులకు అభినందనలు తెలిపిన కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ రావు :
పవన్ కల్యాణ్ గారి ఆశయాలు లక్ష్యాలు కొనసాగేలా ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికైన పెదపవని నీటి సంఘం అధ్యక్షుడు గా మల్లి శెట్టి నాగేశ్వరరావు గారికి చినపవని నీటి సంఘాల సభ్యులు గా భీమవరం ఇందిర దాసరి వెంకట కృష్ణయ్య గారు లకు మాచవరం నీటి సంఘం సభ్యులు గా కూనపరెడ్డి శివరామ బ్రహ్మయ్య గారికి కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ రావు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గారికి రైతులు రైతు కూలీలు కౌలు రైతుల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉంటుంది అనడానికి గత వైకాపా ప్రభుత్వ కాలంలో ఆ ప్రభుత్వ లోపభూయిష్ట విదానాలు వల్ల చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. గత నెలలో పవన్ కల్యాణ్ గారు డిల్లీ పర్యటన లో భాగంగా రైతుల సమస్యల గురించి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తెలిపారు అని భాస్కర్ రావు అన్నారు. లింగ సముద్రం మండల జనసేన అధ్యక్షుడు అంగులూరి నరసింహారావు మాట్లాడుతూ నేడు నీటి సంఘాల అధ్యక్షులు సభ్యులు గా ఎన్నికైన వారు వారివారి నీటి సంఘాల పరిధిలో నీరు సక్రమ నిర్వహణ రైతుల శ్రేయస్సు పారదర్శకత దృష్టిలో ఉంచుకుని పని చేయాలని ఆశించారు. జిల్లా కార్యక్రమాల కార్యదర్శి కొణిదెన శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో జనసేనకు ప్రాతినిధ్యం కల్పించిన కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నీటి సంఘాల అధ్యక్షులు సభ్యులు గా ఎన్నికైన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జనసేన నాయకులు మూలగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మన కందుకూరు ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం . పంటలు పండించడానికి నీరు చాలా విలువైనది. దేవుని దయవల్ల ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవడం తో దాదాపు చెరువులు అన్ని జలకళ తో ఉట్టి పడుతున్నాయి. ఈసందర్భంగా నీటి సంఘాల అధ్యక్షులు సభ్యులు గా ఎన్నికైన ప్రతి ఒక్కరూ రైతులందరికీ ఎంతో పారదర్శకంగా వారి వారి పంటలకు నీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


Be the first to comment