రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి

రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలి

ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

గతంలో సంభవించిన అధిక వర్షాలు వరదల కారణంగా నందిగామ నియోజకవర్గంలో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారని, వారిని తక్షణమే ఆదుకోవాలని ఏపీ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శనివారం నాడు విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయం రైతు శిక్షణ కేంద్రం భవనంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో సంభవించిన విపత్తుతో మునేరు వరదతో నందిగామ నియోజకవర్గంలో పంటపొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతంగం తీవ్ర నష్టాల పాలయ్యారని తెలిపారు. కొందరికి ఇళ్లు దెబ్బతిన నష్టపరిహారం అందాల్సిన వారికి పరిహారం అందజేయాలని కోరారు. ప్రత్యేకించి దెబ్బతిన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మత్తులు చేసి రైతులకు వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్టీఆర్ జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కలక్టర్ లక్ష్మీషా మరియు ఎన్టీఆర్ జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*