శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఎన్డీఏ లోని నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మంచి చేయాలని కలమట సూచించినట్లు రవికుమార్ తెలిపారు. పదవికి ఎంపికైన రవికుమార్ ని కలమట సాలువాతో సత్కరించారు. పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావును రవికుమార్ కలిశారు. ఈయనతోపాటు జనసేన నాయకులు గేదెల చైతన్య, నక్క క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment