పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు టీడీపీలో గుర్తింపు ఉంటుందనీ,దానికి ఉదాహరణ డేగల ప్రభాకర్ కి APIDC ఛైర్మన్ పదవి ఇవ్వటమేనని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.గుంటూరు నగరంలో APIDC ఛైర్మన్ గా డేగల ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గుంటూరులో సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగిన అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ చంద్రబాబు,లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతోందని,ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల చూపు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పైనే ఉందన్నారు.తప్పులు చేసినవారే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు,ఏ తప్పూ చేయని చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టారని,మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్నీ గత సైకో ప్రభుత్వం 20 రోజులు జైల్లో పెట్టిందని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వంలోవలె మన ప్రభుత్వంలో కక్ష సాధింపులు,అక్రమ కేసులు ఉండవని,అలాగే తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామని తెలిపారు.అమెరికాలో బయటపడ్డ జగన్ 1750 కోట్ల లంచం కేసు అతని అవినీతిలో కొంత భాగం మాత్రమేనని,గత ఐదేళ్ల హయాంలో అంతకు పదింతల అవినీతి జరిగింది,త్వరలోనే మొత్తం అన్నీ బయటకు వస్తాయి అన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*