షాద్ నగర్ ఫాంహౌస్ లో రాంగోపాల్ వర్మ

షాద్ నగర్ ఫాంహౌస్ లో రాంగోపాల్ వర్మ..?

ప్రకాష్ రాజ్ కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు..

కమ్మదనం వద్ద ఓ ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో ఉన్నట్టు బోగట్టా

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో.. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆయన చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు ఇదివరకే హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకోగా తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చివర్లని కమ్మదనం గ్రామ పరిధిలో ఉన్న ఓ ప్రముఖ నటుడు ఫామ్ హౌస్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు కమ్మదనం లోని ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ వద్ద నిఘా పెట్టారని తెలుస్తుంది. గతంలోనే తమ ముందు హజరు కావాలని ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఇంటికి వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు. కానీ ఆర్జీవీ మాత్రం.. తాను సినిమాల వల్ల బిజీగా ఉన్నానని, విచారణకు మరింత సమయం కావాలని తన లాయర్ తో పోలీసులకు రిక్వెస్ట్ లెటర్ ను పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ.. ఈ కేసులో అరెస్టు నుంచి తనకు స్టే ఇవ్వాలని కూడా ఏపీ హైకొర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో నాలుగు రోజులు కావడంతో మళ్లీ…తాజాగా.. ఒంగోలు పోలీసులు మళ్లీ హైదరాబాద్ కు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు షాద్ నగర్ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లో ఆయన తలదాచుకున్నట్లు తెలియడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వచ్చారని మీడియా ప్రతినిధులు సైతం సంఘటన స్థలానికి చేరుకుని ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఇంకా సమయం కావాలని మరోసారి లాయర్ పోలీసులు రిక్వెస్ట్ లెటర్ అందించారని, అయిన కూడా పోలీసులు రావడం మాత్రం వార్తలలో నిలిచిందని సినీ రాజకీయ వర్గాలు అంటున్నారు. అయితే.. ఆర్జీవీ ఇంట్లో లేడని అక్కడి వాళ్లు చెప్పినట్లు సమాచారం. కానీ పోలీసులు మాత్రం పలు కొన్ని బృందాలుగా విడిపోయి.. కొంత మంది ఆర్జీవి ఇంటి దగ్గర, మరికొందరు అసలు ఆర్జీవీ ఎక్కడున్నారని కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని రాంగోపాల్ వర్మ కమ్మదనం ఫామ్ హౌస్ వద్ద తలదాచుకున్నట్లు తెలియడంతో పలువురు పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. కొంత మంది మాత్రం ఆర్జీవి తన పరిచయస్తుల, ఫామ్ హౌస్ లో ఉన్నారని కూడా అంటున్నారు. దీంతో పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేస్తారని వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తరపు లాయర్ మాత్రం.. తాము ఆన్ లైన్ లో.. వీడియో మాధ్యమంలో విచారణకు హజరు అయ్యేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పినట్లు తెలుస్తొంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆర్జీవీ అరెస్ట్ కు పోలీసులు అన్ని విధాలుగా రంగం సిద్దం చేసుకుని వచ్చారని కూడా వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం షాద్ నగర్ ఇలాకాలో ప్రముఖ నటుడి వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్న వార్తల నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి విచారణ నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది..

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*