కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ను ఘనంగా సత్కరించడం జరిగింది
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మరియు జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు ఈరోజు మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు స్వగృహానికి విచ్చేశారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న క్రియాశీలక సభ్యత్వల గురించి మోకా వెంకట సుబ్బారావుని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం సుబ్బారావు దంపతులు కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం , జిల్లా ఉపాధ్యక్షుడు దూరి రాజేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాసిన ఫణీంద్ర, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, మేకల చంటి, డేగల వెంకటరమణ పాల్గొన్నారు.


Be the first to comment