భారత్ ఆర్మీకి మరిన్ని అధికారాలు.. రంగంలోకి దిగిన టెరిటోరియల్ ఆర్మీ
భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. సైనిక సామర్థ్యం మరింత బలోపేతం చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్కు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.
టెరిటోరియల్ ఆర్మీలో ఎవరుంటారో తెలుసా?
టెరిటోరియల్ ఆర్మీ భారత సైన్యానికి సహాయక సేవలు అందించే పార్ట్-టైమ్ వాలంటీర్ల రిజర్వ్ ఫోర్స్. సాధారణ సమయాల్లో తమ పనులు చేసుకుంటూ, సైన్యానికి అవసరమైనప్పుడు సేవలు అందిస్తారు. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరికి సైనికులతో సమాన ర్యాంకులుంటాయి. దేశంలో 50 వేల మంది వరకు గల ఈ సైన్యంలో సచిన్, ధోనీ, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, మోహన్ లాల్ వంటి ప్రముఖులున్నారు.


Be the first to comment