విజయనగరం జిల్లా పోలీసు

విజయనగరం జిల్లా పోలీసు

విజయనగరం జిల్లా పూసపాటి రేగ లో భోగాపురం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపిఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు నవంబరు 12న వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు.

సర్కిల్ కార్యాలయంలో గల రికార్డులు, గ్రేవ్ కేసుల సిడి ఫైల్స్ పరిశీలించారు.

అనంతరం, సర్కిల్ పరిధిలోని మహిళా సంరక్షణ పోలీసులతో డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపిఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మమేకమై, వారు నిర్వహిస్తున్న విధులు అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో సైబరు మోసాలు, డిజిటల్ అరెస్టు, డిజిటల్ కోర్టు, ఫెడెక్స్ కొరియర్ సర్వీసు, సోషల్ మీడియా నేరాలు, మాదక ద్రవ్యాల ప్రభావం, దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేసారు.

అనంతరం, పూసపాటి రేగ పోలీసు స్టేషను ప్రాంగణంలో డీఐజీ గారు, ఎస్పీ గారు మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ, ఎస్బి సిఐలు ఎ.వి. లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, సర్కిల్ ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*