మొదటిసారిగా అనంతపురంకు విచ్చేయుచున్న సందర్భంగా “టి.సి.వరుణ్”ఘన స్వాగతం పలకడం జరుగుతుంది

కూటమి తరపున నామినేటెడ్ పదవి “AHUDA” చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు “టి.సి.వరుణ్” గారికి కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు & అభినందనలు తెలియజేస్తూ..

మొదటిసారిగా అనంతపురంకు విచ్చేయుచున్న సందర్భంగా “టి.సి.వరుణ్” 14-11-2024 గురువారం ఉదయం అనంతపురంలో గుత్తి రోడ్ లో జిల్లావ్యాప్తంగా జనసేన పార్టీ తరపున ఘన స్వాగతం పలకడం జరుగుతుంది.

కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కూడా భారీ సంఖ్యలో తరలి వెళ్లి ఘనంగా స్వాగతించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.

కాబట్టి జనసేన పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులు అందరూ తప్పకుండా రావాలని విజ్ఞప్తి.

కళ్యాణదుర్గంలో జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ గారి ఇంటి దగ్గర ఉదయం 8:00 గంటలకు టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. టిఫిన్ తర్వాత 8:30కు అనంతపురంకు బయలుదేరడం జరుగుతుంది.

మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం కూడా జరిగే అవకాశం ఉంటుంది.
~ ఇట్లు ~
జనసేన పార్టీ
కళ్యాణదుర్గం నియోజకవర్గం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*