చంద్రబాబు – పవన్ నాయకత్వంలో తిరుగులేని అభివృద్ధి : ప్రత్తిపాటి
పార్టీకోసం కష్టపడే వారికే పదవులు అనడానికి హరిబాబే నిదర్శనం
• కేంద్రమంత్రిగా పెమ్మసాని రాష్ట్రాభివృద్ధితో పాటు, గుంటూరుజిల్లా ప్రగతికి కృషిచేస్తున్నారు.
• వడ్రాణం హరిబాబు ప్రమాణస్వీకారోత్సవంలో మాజీమంత్రి ప్రత్తిపాటి
పార్టీకోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత, పదవులు లభిస్తాయి అనడానికి వడ్రాణం హరిబాబే నిదర్శనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం గుంటూరులో జరిగిన గుంటూరు జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీ.డీ.సీ.ఎమ్.ఎస్) ఛైర్మన్ వడ్రాణం హరిబాబు పదవీప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ప్రత్తిపాటి పాల్గొన్నారు. కష్టకాలంలో హరిబాబు పార్టీకోసం కష్టపడ్డారు కాబట్టే, హరిబాబుకు తగిన గుర్తింపు లభించిందని, గతంలో కంటే టీడీపీలో పదవులు ఆశించేవారి సంఖ్య పెరిగిందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారమే పదవులు ఇస్తామని ఇప్పటికే అధినేత చంద్రబాబు, యువనాయకుడు లోకేశ్ స్పష్టం చేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే, ప్రస్తుతం టీడీపీ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు. గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రాభివృద్ధితో పాటు, జిల్లా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రత్తిపాటి కొనియాడారు. శంకర్ విలాస్ ఆర్వోబీ సహా పలు ప్రధాన ఆర్వోబీల నిర్మాణానికి పెమ్మసాని విశేష కృషిచేశారన్నారు. తనను గెలిపించిన గుంటూరు ప్రజల రుణం తీర్చుకోవడానికి పెమ్మసాని ఎంతో కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు.


Be the first to comment