ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలను తిలకిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలను తిలకిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నోట తెలుగును వింటుంటే చాలా ఆనందంగా ఉంది. శాసనసభ సమావేశాలలో అనుభవం లేకపోయినా కాగితం మీద రాసుకోకుండా చాలా ఆత్మీయఅచ్చ తెలుగును ఉపయోగిస్తూ ..
అక్కడక్కడ ఈనాటి తరం వినని పదాలను పలుకుతూ అచ్చ తెలుగు వింటూ ఉంటే శాసనసభ సమావేశాలను మరలా మరలా వినాలనిపిస్తుంది. అప్పుడెప్పుడో ఒక నటుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగును బాగా ఉపయోగించేవాడట. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి తెలుగును పవన్ కళ్యాణ్ నోట వింటూ ఉంటే ఓడలు పులకరిస్తున్నాయి.
ఈ తెలుగు భాష కోసమైనా తెలుగు పలకటం చేతకాని తెలుగులో విరిచేసి కతం చేసి ఊరవేసి బూతుల తెలుగు మాట్లాడే ఊర కుక్కలను ఎన్నుకోకుండా ఉంటే బాగుంటుంది
మీ ఆకుల రామ్


Be the first to comment