అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

 

అభివృద్ధి పనులను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 39వ డివిజన్ లోని శాఖరాసికుంటా, విద్యా నగర్లో సిసి రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా తీర్చిదిద్దుతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ సందర్భంగా తెలిపారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి కొండా సురేఖ గారి నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయడమే నా లక్ష్యం అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు.రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి లో తీసుకెళ్తున్నారని గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని కానీ ప్రజా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు గారు తెలియజేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*