ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీల సభ్యుడికి 5 లక్షల భీమా సహాయం
ఆళ్ళగడ్డ:జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న దొర్నిపాడు గ్రామానికి చెందిన దుర్వేసుల నాగేంద్ర ప్రమాద రూపంలో మరణించారు, ప్రమాద బీమాను జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు బీమా ఆర్థిక సహాయాన్ని నాగేంద్ర గారి భార్య లక్ష్మీ గారికి 5 లక్షల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దుర్వేసుల నాగేంద్ర గారి భార్య లక్ష్మి మరియు కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకొని ప్రమాదంలో మరణించినందుకు 5 లక్షల రూపాయల మా కుటుంబ సభ్యులకు అందించినందుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు గారికి, ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య గారికి, ఆళ్లగడ్డ నియోజకవర్గం ఐ.టి కోఆర్డినేటర్ జంబులదిన్నె మామిళ్ల సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ . ఈరోజు దుర్వేసుల నాగేంద్ర గారి కుటుంబానికి వారి కుటుంబ సమస్యలు అన్ని తీర్చుకోపోలేకపోయినా పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి 5 లక్షల రూపాయలు బీమా వారి పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని జనసేన పార్టీలో పని చేస్తున్నటువంటి జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారు కల్పించినటువంటి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ లో జరగబోయే క్రీయాశీల సభ్యత్వం ప్రతి ఒక్క అభిమాని, జనసైనికులు తీసుకొని పార్టీకి మరియు మీ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు జనసేన సభ్యత్వం తీసుకోవలసిందిగా కోరుచున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, దేవా ఆంజనేయులు, సజ్జలు నాగేంద్ర ,ఆవుల జగదీష్, చైతన్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment