బల్లార్పూర్ ఒక మినీ భారతదేశం, ఇక్కడ అన్ని భాషలూ, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారు, మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేలపై జరుగుతుంది
* కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే కచ్చితంగా బయటకు వస్తాను, పొరాడుతాను
* జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లడంలో మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ్ సామ్రాట్ శ్రీ బాలసాహెబ్ ఠాక్రే గారు. బాలాసాహెబ్ ఠాక్రే గారి పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను
* శతాబ్దాల ఎదురుచూపులు తరవాత మనకు అయోధ్య రామ జన్మభూమి లో రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ట జరిగింది. మన బలార్ష ప్రజల అదృష్టం… ఆ ఆలయానికి తలుపులు ఇక్కడ టేకుతో తయారు అయ్యాయి
* దారి పొడవునా వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మొత్తం హైవేలు నిర్మించారు. నిర్మించడానికి రోడ్లు ఏమీ లేవు అని NDA అభ్యర్థి శ్రీ సుధీర్ ముంగటివర్ చెప్పారు, ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ప్రగతి
* శివసేన – జనసేన రెండు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవి. అలాంటి భావనకు స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే గారు. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచాను.
* ఆర్.ఎస్.ఎస్. లేని భారతదేశం ఊహించుకుంటే ఇంత బలంగా ఉండేదా? ఆర్.ఎస్.ఎస్. ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్ట లేకపోయాయి.
* ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ది కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్థాపించేందుకు మీరు అందరూ ఓటు వేయాలి అని కోరుతున్నాను
* నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబించే సెంగోల్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుండి మరాఠా భాషకు పార్లమెంట్ లో క్లాసికల్ భాషగా గుర్తింపు ఇచ్చారు
* భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందాలి
* మహారాష్ట్ర అభివృద్ది చెందాలన్నా, బల్లార్పూరు అభివృద్ది చెందాలన్నా, లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర ఎదగాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థిని గెలిపించండి, ఓట్లు వేయండి.
* నేను ఆంధ్ర ప్రదేశ్ లో మార్పు తీసుకొచ్చి చూపించాను. వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించాను, ఇప్పుడు మీరు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్దం కావాలి
* నా పిల్లలు ఇద్దరితో నేను మరాఠీలో మాట్లాడుతాను, భాష మీద గౌరవంతో నేర్చుకున్నాను. విదేశీ భాషలు నేర్చుకునే మనం, మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా. కనీసం 5 ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలి. మన భాష, సంస్కృతిని నేర్చుకోవాలి.
* దేశానికి మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గెలవకూడదు అని కొందరు అనుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుండి బలంగా అండగా నిలబడి బలమైన నాయకుడిని ప్రధానిగా మూడవ సారి గెలిపించాం.
* 10 ఏళ్ల క్రితం దేశంలో ఎక్కువ ఉగ్రవాద దాడులు జరిగేవి. అలాంటి సమయంలో నేను దేశానికి బలమైన వ్యక్తి ప్రధానిగా ఉండాలి అని కోరుకున్నాను. అప్పుడు నాకు కనిపించిన వ్యక్తి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన నేతృత్వంలో బలమైన దేశంగా భారత్ ఎదిగింది, ఉగ్రవాద దాడుల తగ్గిపోయాయి.


Be the first to comment