ఏపీలో నేటినుంచి కానిస్టేబుల్ ఈవెంట్స్
ఏపీలో నేటి నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈవెంట్స్ జరగనున్నాయి. పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్కి 6,479 మంది హాజరవుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీశ్ తెలిపారు. నగరంలోని నీలం సంజీవరెడ్డి(PTC) మైదానంలో చేపట్టిన ట్రైల్ రన్ సక్సెస్ అయ్యిందన్నారు. వీరిలో 5,242 మంది పురుష అభ్యర్థులు, 1,237 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, మొత్తం కలిపి 6,479 మంది వస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.


Be the first to comment