హితైషులకు శతకోటి వందనాలు

హితైషులకు శతకోటి వందనాలు

సృష్టిలో ప్రతి జీవి తల్లిదండ్రుల రక్తం పంచుకుని జన్మిస్తుంది.
అది రక్త సంబంధం.

పుట్టిన తర్వాత కూడా “రక్తం” పంచుకునే వారే “రక్తదాతలు”. ఇది మన ఆరాధ్య దైవం శ్రీ చిరంజీవి గారు మనకు అందించిన అరుదైన వరం.

కాబట్టి మనది మెగా రక్త సంబంధం.

ఎక్కడో కోనసీమలో పుట్టిన నాకు ప్రేమ ఆప్యాయతలు పంచే కోట్లాదిమంది మెగా అభిమాన కుటుంబంలో స్థానం దక్కిందంటే…

అమ్మనాన్నల తర్వాత నేను దైవంగా ఆరాధించే చిరంజీవి గారు కల్పించిన భాగ్యం.

నా జన్మదినం సందర్భంగా మెగా రక్తసంబంధీకులందరూ నాపై కురిపించిన శుభాశిస్సుల జడివానలో నా జన్మ “చిరు”తార్తమైంది.

మన సేవా ప్రవాహం మరింత ఉధృతం కావాలని కాంక్షిస్తూ…. హితైషులందరికీ శిరసొంచి శతకోటి ప్రమాణాలు.

మీ
ఆత్మీయుడు

రవణం స్వామినాయుడు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*