ఈనెల 10న తూర్పు కాపు ఉద్యోగుల సాధారణ సమావేశం
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈనెల 10వ తేదీ ఆదివారం తూర్పు కాపు ఉద్యోగుల సాధారణ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తూర్పు కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 9 న శనివారం సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులకు సెలవు లేకపోవడంతో సమావేశం ఆదివారానికి వాయిదా వేసినట్లు చెప్పారు. సమావేశం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ జంక్షన్ సమీపంలో వినీలా హోటల్లో ఉదయం 10 గంటల నుండి జరుగుతుందని తెలియజేశారు. ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు.


Be the first to comment